జనగామ లో అట్టహాసంగా కలెక్టర్ కప్-2026 జిల్లా స్థాయి ఇండోర్ గేమ్స్ మీట్ ప్రారంభం

విద్యతో పాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యత ఇవ్వాలి.. ప్రతి విద్యార్థికి క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించడమే లక్ష్యం.. క్రీడలతో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, సమయస్ఫూర్తి అలవడతాయి.. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి): జిల్లా క్రీడా రంగంలో మరో ప్రతిష్ఠాత్మక ఘట్టానికి వేదికైంది. కలెక్టర్ కప్-2026 జిల్లా స్థాయి ఇండోర్ గేమ్స్ మీట్ కార్యక్రమం ఆదివారం, జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి డీసీపీ రాజ మహేంద్ర నాయక్...