జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో వెంటనే ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేయాలి..!
తెలంగాణ ఉద్యమకారుడు ఈగం శ్రీనివాస్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 22 (ప్రజావాణి):జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వెంటనే ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈగం శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నప్పటికీ ఎంఆర్ఐ స్కానింగ్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి నిత్యం వందలాది మంది వివిధ అనారోగ్య సమస్యలతో వస్తున్నారని, వైద్యులు ఎంఆర్ఐ...