చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్
ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి – ఉమా నాగరాజ్ సీఎంసీ 298 డివిజన్ పరిధిలోని ఎన్.జి.ఓఎస్ కాలనీలో ఈరోజు ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రంలో మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు ఆమె స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమా నాగరాజ్ మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో వ్యాధి నుంచి పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం...