ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి – ఉమా నాగరాజ్ సీఎంసీ 298 డివిజన్ పరిధిలోని ఎన్.జి.ఓఎస్ కాలనీలో ఈరోజు ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రంలో మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులకు ఆమె స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉమా నాగరాజ్ మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు బాధ్యతగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో వ్యాధి నుంచి పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు పోలియో వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు.