గ్రామ ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లొద్దు-సర్పంచ్ శ్రీకాంత్
బెజ్జంకి, నవంబర్ 22 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గూడెం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గూడెం గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, రైతులు వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.
చిన్నపిల్లలను ఒంటరిగా బయటకు పంపించవద్దని, ఎలుగుబంటి కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లడం, తరిమే ప్రయత్నం చేయడం చేయకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా ఎలుగుబంటి కనిపించిన వెంటనే గ్రామపంచాయతీ లేదా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ తమతో పాటు ఇతరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్, గ్రామపంచాయతీ పాలకవర్గం విజ్ఞప్తి చేశారు.