ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు పంపిణీ
• పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి
అందోల్ | నవంబర్ | మన ప్రజావాణి | జిల్లా ప్రతినిధి
జోగిపేట మున్సిపల్ పరిధిలోని 15, 16, 17వ వార్డుల్లో నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు ఆరోగ్య సిబ్బంది పోలియో చుక్కలు వేసి, పోలియో వ్యాధి నివారణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ప్రతి తల్లిదండ్రులు తమ చిన్నారులకు తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో మందు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని వైద్య సిబ్బంది కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ శంకర్, హెడ్ నర్స్ సుజాత, ఆశా, ఏఎన్ఎం వర్కర్లు, శాంతా సిస్టర్, అంగన్వాడీ టీచర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్ కాలే, నాయకులు వీరేశం, అశోక్, చెన్నయ్య, విజయ్, భరత్, వినయ్, చంటి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.