*ఎర్రరాయి మైనింగ్ పై ఉక్కుపాదం మోపిన మైనింగ్ శాఖ అధికారులు*
*పలు వాహనాలను సిజ్ చేసిన రెవెన్యూ శాఖ అధికారులు*
*అధికారులు రాయికొత యంత్రాలను దహనంతో చెయ్యడంతో రికేత్తించిన పలు అనుమానాలు ?*
జహీరాబాద్, నవంబర్ 21 (ప్రజావాణి): పట్టణంలో అక్రమంగా ఎర్రరాయి తరలిస్తున్న మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శనివారం డీఎస్పీ సైదా ఆధ్వర్యంలో న్యాల్కల్ మండలంలోని న్యామతాబాద్, గణేష్ పూర్ సహా పట్టణంలో మెరుపు దాడులు నిర్వహించి, ఎర్రరాయి లోడుతో కనిపించిన వాహనాలు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. రాళ్ల అడ్డాపై నిలిపి ఉన్న వాహనాలను సైతం స్వాధీనం చేసుకుని జహీరాబాద్ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎర్రరాయి లోడ్‌తో సహా రెండు లారీలు, నాలుగు ట్రాక్టర్లను , చిరాగ్ పల్లిలో మరో రెండు ట్రాక్టర్ లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పలుమార్లు దాడుల సమాచారం లీక్ కావడం, మాఫియా నెట్వర్క్ బలంగా పనిచేస్తుండటంతో ఈ వ్యవహారం రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి వెళ్లింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు, తక్షణమే ఎర్రరాయి మాఫియాను పూర్తిస్థాయిలో అరికట్టాలని స్థానిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే శనివారం స్థానిక పోలీసులు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగి, ఎర్రరాయి లోడ్లతో ఉన్న వాహనాలను పట్టుకుని స్టేషన్లకు తరలించారు. పోలీసుల తాజా చర్యలతో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది.