ఆడబిడ్డల వివాహాలకు అన్నగా అండగా ఉంటాపేదింటి ఆడబిడ్డ వివాహానికి రూ.5016 ఆర్థిక సాయం
* ఎన్నికల హామీని నిలబెట్టుకున్న వార్డు సభ్యుడు ఎర్ర రాజు
జమ్మికుంట నవంబర్ 21 (ప్రజావాణి)
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత మరిచిపోకుండా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామానికి చెందిన ఒకటో వార్డు సభ్యుడు ఎర్ర రాజుగ్రామంలో సిరి ఫోటో స్టూడియో నిర్వహిస్తున్న పసునూటి సుభద్ర–రమేష్ దంపతుల కుమార్తె వివాహ వేడుకలకు హాజరైన వార్డు సభ్యుడు ఎర్ర రాజు నూతన వధూవరులను ఆశీర్వదించి రూ.5016 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఒకటో వార్డులో ఆడబిడ్డల వివాహాలకు అన్నగా అండగా నిలుస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని భరోసా ఇచ్చారువార్డులో ఏ ఇంట్లో ఆడబిడ్డ వివాహం జరిగినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటానని తెలిపారు ప్రజలకు ఇచ్చిన హామీలు కేవలం ఎన్నికల వరకే పరిమితం కాకూడదని పదవిలో ఉన్నంతకాలం ప్రజలకు సేవ చేయడమే తన బాధ్యతని చాటిచెప్పారుఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను గుర్తుంచుకొని ఆచరణలో పెడుతున్న ఎర్ర రాజును కుటుంబ సభ్యులు గ్రామస్తులు పలువురుఅభినందించారుప్రజాప్రతినిధిఅంటేపదవులుహోదాలు మాత్రమే కాదనిప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే బాధ్యత కూడా అని పలువురు ప్రశంసించారుఈ కార్యక్రమంలో బిజిగిరి సంపత్ బిజిగిరి రమేష్ బిజిగిరి రవి కల్లేపల్లి కుమార్ సంపత్ ఆర్ఎంపీ శ్రీను నాగరాజు రాకేష్ తదితరులు పాల్గొన్నారు