prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 2:18 pm Digital Edition : PRAJA VANI

అయ్యప్ప స్వామి ఆలయంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు

అయ్యప్ప స్వామి ఆలయంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు

ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించిన ఎంపీ

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 22:

సుల్తానాబాద్ పట్టణంలోని నీరుకుల్లా రోడ్డులో ఉన్న శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయాన్ని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం వంశీకృష్ణ సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి చేరుకున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణకు అయ్యప్ప స్వాములు భక్తిశ్రద్ధలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, అయ్యప్ప స్వాములు శాలువాలతో ఆయనను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పుష్కలంగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, స్వామివారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.