prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 7:08 am Digital Edition : PRAJA VANI

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మునుగోడు యువకుడు సాయితేజ మృతి

*అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మునుగోడు యువకుడు సాయితేజ మృతి*

*తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి, ఇటీవలే ఉద్యోగం సాధించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్న మన నల్గొండ జిల్లా మునుగోడు పట్టణానికి చెందిన యువకుడు సాయితేజ (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్రంగా కలిచివేసింది. వారం రోజుల క్రితమే ఉద్యోగం వచ్చిందన్న శుభవార్త విన్న ఆ తల్లిదండ్రులకు, ఇంతలోనే కుమారుడి మరణవార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరమని రాష్ట్ర రోడ్లు భవనాలు & సినిమాటోగ్రాఫి శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ కష్ట సమయంలో సాయితేజ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. మునుగోడు పట్టణంలో సాయితేజ మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి.