పాఠశాల విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రాలపై అవగాహన

పోరుమామిళ్ల:నవంబర్ 21 ప్రజావాణి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఆసక్తిని కలిగించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పురుషుల కళాశాలలో జ్ఞాన విహార స్కూల్ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఫిజిక్స్,జువాలజీ,జియాలజీ,బయోటెక్నాలజీ, బోటనీ తదితర సైన్స్ విభాగాలకు సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాలను విద్యార్థులకు వివరించి, ఆయా శాస్త్రాల్లోని ప్రాధాన్యతను తెలియజేశారు.ఈ సందర్భంగా కళాశాలలోని వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు విద్యార్థులకు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించారు. పాఠ్యపుస్తకాల్లో చదివే అంశాలకు అదనంగా ప్రయోగాత్మకంగా, ప్రత్యక్షంగా విజ్ఞాన శాస్త్రాల గురించి...