దళితుల ఆశాజ్యోతి ఫాదర్ ఆర్. జోసెఫ్ 37వ వర్ధంతి: పోరుమామిళ్ల హోలీ రోసరి చర్చిలో ఘన నివాళులు
కడప జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలోని చారిత్రాత్మక హోలీ రోసరి చర్చిలో దళిత క్రైస్తవుల ఆశాజ్యోతి, కడప మిత్రసనం గురువులు రెవరెండ్ ఫాదర్ ఆర్. జోసెఫ్ స్వాములవారి 37వ వర్ధంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. వివిధ ప్రజాసంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దళిత బిడ్డలందరూ ఏకమై, ప్రముఖ క్రైస్తవ గురువులు డేవిడ్ ఫాదర్, ఫాదర్ సురేష్ మరియు భాస్కర్ స్వామి టీంల సమక్షంలో ఫాదర్ జోసెఫ్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేకప్రార్థనలు, సభను ఉద్దేశించి...