పోరుమామిళ్లలో వైభవంగా‘కళ్యాణి ఫిజియో కేర్ క్లినిక్’ ప్రారంభం: నాణ్యమైన వైద్య సేవలు స్థానికులకే చెంతకు!
పోరుమామిళ్ల,నవంబర్ 21(ప్రజావాణి): వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలో సరికొత్త వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో ఉన్న ఆర్సీఎం కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘కళ్యాణి ఫిజియో కేర్ క్లినిక్’ శుక్రవారం అత్యంత ఘనంగా ప్రారంభమైంది.స్థానిక ప్రజలకు అత్యాధునిక,నాణ్యమైన ఫిజియోథెరపీ సేవలను అందించే లక్ష్యంతో ఈ క్లినిక్‌ను నిర్వాహకులు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన చిత్తా సునంద రెడ్డి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీ వుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి,సతీమణి చిత్తా సునంద...