చింతలచెరువు సర్పంచ్ బరిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ద్వారంపూడి లావణ్య: గ్రామ వికాసమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ మద్దతుతో నామినేషన్

బద్వేల్ నవంబర్ 21 ప్రజావాణి ఉన్నత చదువులు చదివి, ప్రముఖ కార్పొరేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా నెలకు లక్షల రూపాయల జీతం సంపాదిస్తున్న ఒక యువతి, విలాసవంతమైన జీవితాన్ని వదిలి గ్రామ సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ పరిధిలోని చింతలచెరువు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ద్వారంపూడి లావణ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నామినేషన్ వేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని, కార్పొరేట్ నైపుణ్యాలను తన సొంత గ్రామ అభివృద్ధికి ఉపయోగించాలనే సంకల్పంతో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం స్థానికంగా పెద్ద...