సేవకు సరిహద్దులు లేవు.. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్…!
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 21(ప్రజావాణి):మానవత్వం అంటే ఏమిటో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ మరోసారి చేసి చూపించింది. దూరం ఎంతైనా సరే, ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాలనే తపనతో ఏకంగా 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సాయం అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఛత్తీస్గఢ్ సరిహద్దు గ్రామానికి చెందిన కిరణ్ జీవితం ఎంతో కష్టాల్లో ఉంది. పుట్టుకతోనే ఒకే కిడ్నీతో పుట్టిన ఆయన ఇప్పుడు షుగర్ వ్యాధితో ఆ కిడ్నీ కూడా పాడవడంతో మంచాన పడ్డారు. కాళ్లు వాచిపోయి నడవలేని పరిస్థితి. భార్య,...