విద్యార్థుల ప్రదర్శనలతో అలరించిన పాఠశాల స్థాయి సామాజిక శాస్త్ర మేళా
విద్యార్థుల ప్రదర్శనలతో అలరించిన పాఠశాల స్థాయి సామాజిక శాస్త్ర మేళా దండేపల్లి, నవంబర్ 21 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ద్వారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పాఠశాల స్థాయి సామాజిక శాస్త్ర మేళాను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. భూతాపం నివారణ, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ, అటవీ సంరక్షణ, ఓటు హక్కు వినియోగం, బ్యాంకింగ్ విధానాలు, విపత్తుల నివారణ, భూగర్భ జలాల పొదుపు వినియోగం, ఎల్నినో...