prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 3:43 pm Digital Edition : PRAJA VANI

వితంతు పింఛన్‌కు రూ.10 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

వితంతు పింఛన్‌కు రూ.10 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఎంపీడీవో కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

కరీంనగర్,నవంబర్ 21 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో ప్రభుత్వ ఉద్యోగిని లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి చవాన్ లాల్ వితంతు పింఛన్ మంజూరు చేసేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో బాధితురాలి మామ ఎడ్ల రాజిరెడ్డి నుంచి శనివారం మానకొండూరు ఎంపీడీవో కార్యాలయంలో నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి చవాన్ లాల్‌ను పట్టుకున్నారు.అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.