లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే కఠిన చర్యలు.. డిఎమ్ఎచ్ఓ డా. వాణి శ్రీ
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20(ప్రజావాణి): జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు ఎవరైనా నిర్వహించినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డా. వాణి శ్రీ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర స్కానింగ్ కేంద్రం, విజయ ఆసుపత్రి, లక్ష్మి స్కానింగ్ కేంద్రాలను ఆమె ప్రోగ్రాం అధికారులతో కలిసి సందర్శించి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కానింగ్ కేంద్రాల్లో గర్భధారణకు ముందు మరియు గర్భధారణ సమయంలో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం, 1994 (PCPNDT)....