prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 6:44 pm Digital Edition : PRAJA VANI

రాష్ట్రస్థాయి విజ్ఞాన ప్రదర్శనకు ఎంపికైన కృష్ణవేణి విద్యార్థిని

*రాష్ట్రస్థాయి విజ్ఞాన ప్రదర్శనకు ఎంపికైన కృష్ణవేణి విద్యార్థిని*

రాయికల్, నవంబర్ 21(ప్రజావాణి)

జగిత్యాల జిల్లా కేంద్రంలో నవంబర్ 19, 20, 21 తేదీల్లో నిర్వహించిన జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనలో పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు.ఈ ప్రదర్శనలో పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని నీలి అగస్త్య వినూత్నంగా రూపొందించిన సౌరశక్తి చెక్క చిన్న వేడి పెట్టె నమూనాను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది. ఈ నమూనా జిల్లా స్థాయిలో ఎంపికై రాష్ట్రస్థాయి విజ్ఞాన ప్రదర్శనకు అర్హత సాధించింది.ఈ సందర్భంగా జగిత్యాల ఓల్డ్ హై స్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాము, ఓల్డ్ హై స్కూల్ ప్రధానాచార్యులు చంద్రకళ, జిల్లా విజ్ఞానాధికారి మచ్చ రాజశేఖర్, గ్రంథాలయ అధ్యక్షులు దినేష్, వార్డు సభ్యులు లక్ష్మి మరియు పట్టభద్ర కళాశాల ప్రధానాచార్యులు నాగభూషణం చేతుల మీదుగా విద్యార్థిని ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థిని నీలి అగస్త్యను పాఠశాల నిర్వాహకులు జూపల్లి తిరుపతిరావు, ప్రధానాచార్యులు జూపల్లి వేణుగోపాల్ రావు మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, శాస్త్రీయ ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించడమే తమ పాఠశాల లక్ష్యమని పాఠశాల యాజమాన్యం పేర్కొన్నారు.