prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 7:29 pm Digital Edition : PRAJA VANI

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాలి తహసీల్దార్ రమేష్ బాబు

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటాలి
తహసీల్దార్ రమేష్ బాబు

ప్రజావాణి రిపోర్టర్ నర్సింహులపేట నవంబర్ 21 : క్రీడాకారులు పట్టుదల, క్రమశిక్షణతో సాధన చేసి రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు మంచి పేరు తీసుకురావాలని తహసీల్దార్ రమేష్ బాబు ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అండర్‌-14 విభాగంలో ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టుకు ఎంపికైన 14 మంది కబడ్డీ క్రీడాకారులకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని అభినందించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన క్రీడాకారులతో కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పీడీలు కొమురయ్య, శ్రీను, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.