మధిర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల ప్రకంపనలు..!డాక్యుమెంట్లకు ఓ రేటు.. డబ్బులు ఇస్తేనే చేతికి పత్రాలు

మధిర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల ప్రకంపనలు!డాక్యుమెంట్లకు ఓ రేటు.. డబ్బులు ఇస్తేనే చేతికి పత్రాలు!ప్రభుత్వ రుసుములకు అదనంగా వసూళ్లా? మధ్యవర్తుల హవా నడుస్తోందా? ఆధారాలతో వెలుగులోకి వస్తున్న వ్యవహారాలు!జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు స్పందించేదెప్పుడు?మధిర: మన సమగ్ర ప్రజావాణి ప్రత్యేక ప్రతినిధిప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందించాల్సిన కార్యాలయంలోనే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా మధిర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్, వాటి జారీ ప్రక్రియకు సంబంధించి అదనపు డబ్బుల వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు...