ప్రైవేట్ ఆసుపత్రులపై డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు.. నిబంధనలు పాటించాలని హెచ్చరిక..!
అనుమతులు లేకుండా ఆసుపత్రి నడిపితే కఠిన చర్యలు.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. వాణిశ్రీ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 21 (ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో పలు ప్రైవేట్ ఆసుపత్రులపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. వాణిశ్రీ శనివారం వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డా. సంధ్యతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డా. వాణిశ్రీ మాట్లాడుతూ, ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు పొందిన తర్వాతే నిర్వహించాలని...