prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 3:29 pm Digital Edition : PRAJA VANI

ప్రభుత్వ నిర్లక్ష్యంతో అసంపూర్తిగా పండ్ల మార్కెట్.. రైతులు, వ్యాపారులకు తీరని ఇబ్బందులు

**ప్రభుత్వ నిర్లక్ష్యంతో అసంపూర్తిగా పండ్ల మార్కెట్.. రైతులు, వ్యాపారులకు తీరని ఇబ్బందులు!**

వరంగల్, నవంబర్ 21: వరంగల్ ఆర్టీసీ బస్‌స్టేషన్ సమీపంలోని లక్ష్మీపురంలో అసంపూర్తిగా నిలిచిపోయిన సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులు, వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ డిమాండ్ చేశారు.

ఈ మేరకు బీజేపీ నాయకులు, పండ్ల మార్కెట్ వ్యాపారులతో కలిసి GWMC కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. మార్కెట్‌లో నిర్మించాల్సిన 85 గదుల పనులు నిధుల విడుదలలో జాప్యం, కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో నిలిచిపోయాయని తెలిపారు.

సరైన వసతులు లేక రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎండా, వర్షాలకు పండ్లు పాడై ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి, నిర్మాణ పనులు పూర్తి చేసి మార్కెట్‌ను త్వరితగతిన ప్రారంభించాలని కమిషనర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, బీజేపీ రాష్ట్ర నాయకులు బైరి మురళీకృష్ణ, పండ్ల మార్కెట్ వ్యాపారులు వెల్ది సాంబయ్య, చెన్నమల్లు యాదవ్, నందప్రియ, అమర్ చందు, సమ్మయ్య, అంజద్ తదితరులు పాల్గొన్నారు.