*ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి : సర్పంచ్ ఏం డి చేష్మొద్దీన్*
*అన్నీ రకాల ప్రయోజనాలు స్మార్ట్ కార్డులోనే : పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి*
*శేఖపూర్ గ్రామ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డు, ఇందిరమ్మ భీమా ఫారలు పంపిణి*
జహీరాబాద్, నవంబర్ 20 (ప్రజావాణి): మండల పరిధిలోని శేఖాపూర్ గ్రామంలో నూతన చేయూత పింఛన్, స్మార్ట్ కార్డులు, ఇందిరమ్మ భీమా మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం గ్రామ సర్పంచ్ మహమ్మద్ చేష్మొద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మొత్తం 49 మంది అర్హులైన నిరుపేదలకు (ఒంటరి మహిళలు, వితంతువులు, తదితరులు) నూతన పింఛను మంజూరు పత్రాలను ఆయన పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి తో కలిసి అందజేశారు. ప్రభుత్వం నుంచి పింఛను మంజూరు కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వాల ధ్యేయం కావాలి. ఈ సందర్భంగా సర్పంచ్ మహమ్మద్ చేష్మొద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసమే నిరంతరం కృషి చేయాలని, పల్లెల అభివృద్ధికి పూర్తిగా సహకరించాలని ఆకాంక్షించారు. సమాజంలో ఆదరణ కరువై, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఈ ‘చేయూత’ పింఛన్లు ఒక ఆర్థిక భరోసాను కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ న్యామతాబాద్ పద్మమ్మ, పంచాయతీ కార్యదర్శి భాగ్యలక్ష్మి, వార్డు సభ్యులు గొటటి శేఖర్, మహమ్మద్ జాహిరుద్దీన్, జాహెద్ అలీ, స్థానిక నాయకులు మహమ్మద్ అబ్దుల్ రవూఫ్, ఆరిఫ్ అలీ, మహమ్మద్ సైఫ్ తదితరులతో పాటు గ్రామస్తులు, నూతన పింఛన్ లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.