ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా
వరికోలులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పోస్టర్ ఆవిష్కరణ
ప్రజావాణి పత్రిక – నడికూడ మండలం:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో పరకాల నియోజకవర్గం, నడికూడ మండలం వరికోలు గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఊర రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ కార్యక్రమం చేపట్టారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ పథకం గురించి గ్రామంలోని ప్రతి కుటుంబానికి తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు కష్టకాలంలో అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సాంబశివరావు, గ్రామ సర్పంచ్ దొగ్గేల కుమారస్వామి, ఉప సర్పంచ్ భుజంగరావు, నడికూడ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దొగ్గేల వినయ్, మండల కాంగ్రెస్ నాయకులు గౌడ శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, కళాకారుల సంఘం జిల్లా నాయకులు రామంచ రాజేందర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గడ్డం రాజు, కుమారస్వామి, పరమేష్, మహేందర్, సాంబయ్య, గుడి చైర్మన్ రమేష్, బీసీ సెల్ అధ్యక్షుడు కోరే రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాస్ తిరుపతి, బీఎల్ఏలు బొల్లా ఓదెలు, యూత్ కాంగ్రెస్ గ్రామ ప్రధాన కార్యదర్శి గిన్నారపు టోనీ, ఉపాధ్యక్షులు దొగ్గేల రాజ్, దోమల హరీష్, కాంటెస్ట్ వార్డు సభ్యులు దొగ్గేల కొమురయ్య, రామంచ శ్రీనివాస్, గ్రామ కారోబార్ పర్శ భాస్కర్, గ్రామస్థులు రాజ్ కుమార్, సాంబయ్య, కొమురయ్య, మల్లయ్య, పోచయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
