prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 10:56 am Digital Edition : PRAJA VANI

పోలవరం జిల్లా నూతన జెడ్పీ చైర్‌పర్సన్‌గా వంతల రాజేశ్వరి ప్రమాణ స్వీకారం

పోలవరం జిల్లా నూతన జెడ్పీ చైర్‌పర్సన్‌గా వంతల రాజేశ్వరి ప్రమాణ స్వీకారం

​ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం నవంబర్ 20

పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలం పోలవరం నూతన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా వంతలబాధ్యతలు స్వీకరించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉన్నతాధికారుల సమక్షంలో ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
​ఈ సందర్భంగా నూతన చైర్‌పర్సన్ వంతల రాజేశ్వరి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్టానానికి, సహకరించిన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, ముఖ్యంగా ఏజెన్సీ మరియు మారుమూల గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, రహదారుల పోలవరం ప్రాజెక్టు సంబంధించిన బాధితులకు ఆర్ అండ్ ఆర్ స్టేక్కర్ పునరవాసు కల్పించే విధంగా చూస్తానని అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తానని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని మండలాలను కలుపుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది