పోతిరెడ్డిపల్లిదేవస్థానంలోఇందిరమ్మకుటుంబజీవితబీమానమోదుకార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
జమ్మికుంట నవంబర్ 21 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని హుజురాబాద్ నియోజకవర్గం వోడితల ప్రణవ్ ఆదేశాల మేరకు పోతిరెడ్డిపల్లి దేవస్థానంలో ప్రారంభించారు
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషకరమనిఈ బీమా ప్రతి పేద కుటుంబానికి ఒక కొండంత అండ వారి కుటుంబానికి భరోసా అని పేర్కొన్నారుఇంతటి మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకధన్యవాదాలుతెలిపారుగ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో గ్రామ కార్యదర్శి వద్దకు వెళ్లి వెంటనే జీవిత బీమా నమోదు చేసుకోవాలని తెలిపారుఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పంజాల సతీష్ గౌడ్ చేపూరి రాజు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రాపర్తి రవి ఉప సర్పంచ్ రాపర్తి సంధ్య కొమురయ్య గౌడ్ ఆరో వార్డు చేపూరి శ్రీకాంత్ చందుపట్ల శ్రీధర్ రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు