*పాల్వాయి సేవలు మరవలేనివి*
*బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
దివంగత రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి పాల్వాయి గోవర్థన్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గానికి చేసిన సేవలు ఎన్నటికి మరవలేనివని ఆయన తనయురాలు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన 90వ జయంతిని చండూరులో బీఆర్ఎస్ నాయకులు, ఆయన అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించారు.ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన చూపిన బాటలోనే పయణించి కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటు వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని, పేదలకు తన సాయం అందిస్తానని తెలిపారు. పలువురు నాయకులు మాట్లాడుతూ పాల్వాయి గోవర్థన్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులను సేవలను కొనియాడారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్, బీఆర్ఎస్ మండల కీలక నేత,మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి శేకర్, ముఖ్యనేత తేలుకుంట్ల జానయ్య, కౌన్సిలర్ కొన్రెడ్డి మధు, సామ యాదిరెడ్డి, తేలుకుంట్ల చంద్రశేకర్, మాజీ కోఆప్షన్ రావిరాల నగేష్, ఇరిగి రామన్న, తాడిశెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.