నూతన ఎస్ఐ ఉపేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉప సర్పంచుల ఫోరం నాయకులు
ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 21: నరసింహులపేట పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఉపేందర్ సార్‌ను ఈరోజు ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చుక్క వేణు ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు కాస యాకయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ యాకుబ్, మండల ఉపాధ్యక్షుడు అజ్మీర రవిబాబు తదితరులు పాల్గొన్నారు.