prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 12:40 pm Digital Edition : ANILKOTAGIRI KOTAGIRI

నిరుపేద కుటుంబానికి మోరీల్ శ్రీనివాస్ రావు ఆర్థిక చేయూత.

నిరుపేద కుటుంబానికి మోరీల్ శ్రీనివాస్ రావు ఆర్థిక చేయూత.

అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్ నేతలు.

వర్ని/ప్రజావాణి:-నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజక వర్గం వర్ని మండలంలోని జాకోర గ్రామానికి చెందిన గుండ్ల సాయిలు తల్లి అనారోగ్యంతో శనివారం మరణించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు మోరీల్ శ్రీనివాస్ రావు తక్షణమే స్పందించారు. సాయిలు కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మృతురాలి అంత్యక్రియల నిమిత్తం ఆయన రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని పంపించారు.ఈ మొత్తాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబానికి అందజేసి వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.