prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 11:29 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

దొంతాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ప్రజా ప్రభుత్వంలోనే రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని బుగ్గారం మాజీ జెడ్పీటీసీ బాధినేని రాజేందర్ అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవతో ధర్మపురి మండలం దొంతాపూర్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర పొందాలని సూచించారు. తూకాల్లో అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలని నిర్వాహకులను కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ మొగిలి సాయికుమార్, సర్పంచ్ స్వరూప లక్ష్మణ్, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.