prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 7:08 am Digital Edition : UPENDHAR JANAGON

చిన్నారిని ఆశీర్వదించిన.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20(ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన రమేష్ యాదవ్ కూతురి నూతన వస్త్రాలంకరణ మహోత్సవానికి మాజీ మంత్రివర్యులు, పాలకుర్తి బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా చిన్నారికి నూతన వస్త్రాలు అందజేసి, చిన్నారి ఆయురారోగ్యాలతో, సకల విద్యలతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.