*చండూరు లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవం – లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్స్ పంపిణీ*
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
చండూరు మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం పిఆర్ గెస్ట్ హౌస్ చండూరు నందు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చండూరు మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన చేయూత పెన్షన్ ప్రొసీడింగ్స్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయములో అందజేయడం జరిగింది. అక్కడ పెన్షన్ ప్రొసీడింగ్స్ తీసుకొని లబ్ధిదారులకు పిఆర్ గెస్ట్ హౌస్ నందు నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం మరియు పాలక వర్గం సభ్యుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరియు ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబ పెద్దను కోల్పోయిన సందర్భంలో అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా ఆర్థిక సహాయం అందించడం వల్ల ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.
ఐకెజెబిపి వివరాలు:-
* కుటుంబాన్ని పోషించే 18-59 ఏళ్ల వయస్సు గల సభ్యుడు భీమా పొందే వ్యక్తిగా ప్రతిపాదించబడతారు.
* వయస్సు దృవీకరణకు ఆధార్ కార్డు ప్రతిని ప్రాతిపదికగా తీసుకుంటారు.
* బీమా పొందే వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు అందజేస్తారు.
* ఒకరి కంటే ఎక్కువ మంది నామినీలను నమోదు చేసుకోవచ్చు. వారికి అందాల్సిన వాటాలను శాతాల వారీగా పేర్కొనాలి.
* బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.
* అవసరమైన రేషన్ కార్డు, ఆధార్ కార్డులను ఆయా వార్డు క్యాంపులకు తీసుకురావాలి.
దరఖాస్తుల స్వీకరణ గడువు:-
* 19 నవంబర్ – 18 డిసెంబర్ 2026.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం, కౌన్సిలర్లు తెలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, బుషిపాక వాసు, సామ సుజాత యాదవ రెడ్డి, జెల్ల ధనమ్మ శ్రీనివాస్, కొన్రెడ్డి మధు, కో-ఆప్షన్ సభ్యులు మొగుదాల సత్తమ్మ వెంకన్న, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, పట్టణ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొనడం జరిగింది.
