*గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన పఠాన్ జమీల్ ఖాన్*
* *మన ప్రజావాణి, మందమర్రి:-*
హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జయంత్ రెడ్డి ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 40 నిమిషాల ఈవెంట్ కటాస్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారుడు పఠాన్ జమీల్ ఖాన్ అద్భుత ప్రతిభ కనబరిచారు. జమీల్ ఖాన్ ఈ పోటీల్లో పాల్గొని రెండు బంగారు పతకాలు, సర్టిఫికెట్లు సాధించి విజేతగా నిలిచారు. ఈ విశేష ప్రతిభను గుర్తించిన అకాడమీ నిర్వాహకులు ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఐరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను ప్రదానం చేయగా, ఈ రికార్డులను తైక్వాండో అకాడమీ గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి అందజేశారు. తైక్వాండో క్రీడలో నిరంతరం సాధన చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న జమీల్ ఖాన్ ను అకాడమీ సభ్యులు అభినందించారు. అనంతరం పఠాన్ జమీల్ ఖాన్ సాధించిన విజయంపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి లు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. రాష్ట్రం నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు..