prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 11:19 am Digital Edition : PRAJA VANI

కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం ఎంతో అదృష్టం: స్పీకర్ గడ్డం ప్రసాద్

కొండగట్టు అంజన్న నిజరూప దర్శనం ఎంతో అదృష్టం: స్పీకర్ గడ్డం ప్రసాద్

మల్యాల, నవంబర్ 21 (ప్రజావాణి): కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి నిజరూప దర్శనం చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. సుమారు 60 ఏళ్లకు ఒకసారి మూలవిరాట్టుపై ఉన్న చందనాన్ని తొలగించే పవిత్ర సందర్భంలో స్వామివారి నిజరూప దర్శనం కలగడం భక్తులకు గొప్ప భాగ్యమని పేర్కొన్నారు.

ఈ అరుదైన దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు కృషి చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరువు పరిస్థితుల నుంచి త్వరగా బయటపడాలని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే శక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రసాదించాలని ఆంజనేయస్వామిని ప్రార్థించినట్లు స్పీకర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.