prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 6:41 pm Digital Edition : PRAJA VANI

ఏఎస్సై నుంచి ఎస్సైగా పదోన్నతి పొందిన ఎం. లక్ష్మికి అభినందనలు

ఏఎస్సై నుంచి ఎస్సైగా పదోన్నతి పొందిన ఎం. లక్ష్మికి అభినందనలు

నవంబర్ 21 ప్రజావాణి న్యూస్ /సంగెం

సంగెం పోలీస్ స్టేషన్‌లో విశేష సేవలందించిన ఎం. లక్ష్మికి పదోన్నతి.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సంగెం పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI)గా విధులు నిర్వహించిన ఎం. లక్ష్మి సబ్ ఇన్‌స్పెక్టర్ (SI)గా పదోన్నతి పొందారు.
సంగెం పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన కాలంలో ఎం. లక్ష్మి తన విధులను ఎంతో క్రమశిక్షణతో, అంకితభావంతో, బాధ్యతాయుతంగా నిర్వహించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, పోలీస్ స్టేషన్‌లో రోజువారీ విధుల నిర్వహణలో చురుకైన పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎన్. శ్వేత, ఐ.పీ.ఎస్. పదోన్నతి పొందిన ఎం. లక్ష్మిని అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
అలాగే సంగెం ఎస్సై కె. వంశీకృష్ణ ఎం. లక్ష్మికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, సంగెం పోలీస్ స్టేషన్‌లో ఆమె అందించిన సేవలు అభినందనీయమని, విధుల పట్ల ఆమె చూపిన అంకితభావం ఇతర సిబ్బందికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
పదోన్నతి పొందిన ఎం. లక్ష్మికి సంగెం పోలీస్ స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎస్సైగా ఎన్నికైన లక్ష్మికి ప్రజాప్రతినిధులు పత్రికా మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు