prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 7:45 am Digital Edition : UPENDHAR JANAGON

ఎన్ఐ యాక్ట్‌పై “నేడు” ప్రత్యేక లోక్ అదాలత్

 

పెండింగ్‌లో ఉన్న కేసులు రాజీ మార్గంలో పరిష్కరించబడతాయి.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ

జనగామ జిల్లా కోర్టులో ‘”నేడు” నవంబర్ 21, (శనివారం)న ఎన్ఐ యాక్ట్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లో ఎన్ఐ యాక్ట్ కింద పెండింగ్‌లో ఉన్న కేసులు రాజీ మార్గంలో పరిష్కరించబడతాయని ఆమె పేర్కొన్నారు. కేసుల సత్వర పరిష్కారం కోసం, సమయం, ఖర్చు ఆదా కోసం కక్షిదారులు, న్యాయవాదులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రాజీ కుదిరిన కేసుల్లో కక్షిదారులకు కోర్టు ఫీజు తిరిగి చెల్లించబడుతుందని, లోక్ అదాలత్ తీర్పు తుది తీర్పుగా పరిగణించబడుతుందని, దానిపై అప్పీలు ఉండదని ఆమె తెలిపారు.

ఎన్ఐ యాక్ట్ కేసులు కలిగిన కక్షిదారులందరూ ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లో పాల్గొని తమ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.