prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 7:12 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ఎండపల్లి మండలంలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ నమోదు ప్రారంభం

మండలంలోని కొండపూర్, రాజరాంపల్లి, సూరారం, శానబండ గ్రామ పంచాయతీలలో శుక్రవారం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ఆన్‌లైన్ డేటా ఎంట్రీ ప్రక్రియ ప్రారంభమైందని ఎంపీడీవో డి కృపాకర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జెడ్పీ సీఈఓ బి గౌతమ్ రెడ్డి, డీఎఫ్ఓ ఎం రవి ప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యటించి నమోదు ప్రక్రియను పరిశీలించారు. అర్హులైన ఏ ఒక్క కుటుంబం నష్టపోకుండా పారదర్శకంగా వివరాలు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. లబ్ధిదారులు పంచాయతీ సిబ్బందిని సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.