*ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.సర్పంచ్ ఎంపెల్లి నాగలక్ష్మి వినోద్*
*18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన వారు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి.. వానల్పహాడ్ గ్రామ పంచాయతీలో దరఖాస్తుల స్వీకరణ*
నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 21:-
ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వానల్పహాడ్ గ్రామ పంచాయతీ ప్రతినిధులు కోరారు. ఈ పథకానికి సంబంధించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత ఉన్నవారు ఎవరూ ఈ అవకాశాన్ని కోల్పోకుండా వెంటనే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తులు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ఈ పథకంపై గ్రామ ప్రజలు అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భైంసా ఎంపీడీవో ప్రదీప్, గ్రామ సర్పంచ్ ఎంపెల్లి నాగలక్ష్మి వినోద్, ఉప సర్పంచ్ సాయిరెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి గాయత్రి, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.