ఇంగ్లీష్ ఒలింపియాడ్‌లో ప్రథమ స్థానం.. సైన్స్ పోటీల్లోనూ సత్తాచాటిన గుగ్గిళ్ల విద్యార్థులు
మండల స్థాయి పోటీల్లో గుగ్గిళ్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ బెజ్జంకి, నవంబర్ 21 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలో నిర్వహించిన విద్యా పోటీల్లో ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు. ఇంగ్లీష్ ఒలింపియాడ్ పోటీల్లో 8వ తరగతి విద్యార్థిని దుగ్యాని ప్రణవి జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించి ప్రతిభ చాటింది. అలాగే 9వ తరగతి విద్యార్థి కొంకటి భువనేశ్వర్ సీనియర్ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించాడు. అదేవిధంగా చెకుముకి సైన్స్ పోటీల్లో...