prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 3:24 pm Digital Edition : RAJASHEKARREDDY

ఇంగ్లీష్ ఒలింపియాడ్‌లో ప్రథమ స్థానం.. సైన్స్ పోటీల్లోనూ సత్తాచాటిన గుగ్గిళ్ల విద్యార్థులు

మండల స్థాయి పోటీల్లో గుగ్గిళ్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

బెజ్జంకి, నవంబర్ 21 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలో నిర్వహించిన విద్యా పోటీల్లో ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు. ఇంగ్లీష్ ఒలింపియాడ్ పోటీల్లో 8వ తరగతి విద్యార్థిని దుగ్యాని ప్రణవి జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించి ప్రతిభ చాటింది. అలాగే 9వ తరగతి విద్యార్థి కొంకటి భువనేశ్వర్ సీనియర్ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించాడు. అదేవిధంగా చెకుముకి సైన్స్ పోటీల్లో మండల స్థాయిలో తృతీయ బహుమతి సాధించి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చారు.విద్యార్థులు చదువుతోపాటు వివిధ విద్యా పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. బహుమతులు సాధించిన విద్యార్థులను అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మమతా గౌతమి, ఉపాధ్యాయులు ఓదయ్య, బుచ్చయ్య, రాజిరెడ్డి, తిరుపతి, లక్ష్మయ్య, మంజులత, సమత తదితరులు పాల్గొన్నారు.