prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 9:47 am Digital Edition : RAJASHEKARREDDY

అదుపుతప్పి బోల్తాపడిన ఆటో.. పలువురికి గాయాలు

తోటపల్లి–దేవక్కపల్లి గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం

బెజ్జంకి, నవంబర్ 21 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి, దేవక్కపల్లి గ్రామాల మధ్య శనివారం ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. TS12UC3925 నంబర్ గల ఆటో సిద్దిపేట నుంచి ధర్మపురి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆటోలో ప్రయాణిస్తున్నవారు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.