అంబులెన్స్ లోగర్భిణికి ప్రసవం 108 సిబ్బంది సేవలకు బంధువుల కృతజ్ఞతలు

మేడ్చల్ (ప్రజా వాణి):- మూడు చింతలపల్లి కొల్తూర్‌కు చెందిన జానకి అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది ఆమెను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ప్రసవం జరిగింది. అంబులెన్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఈఎంటీ శ్రీరామ్, పైలట్ తిరుపతి సమయస్ఫూర్తితో స్పందించి తల్లి, బిడ్డకు అవసరమైన సహాయం అందించారు. అత్యవసర సమయంలో అందించిన సేవలు, చూపిన చొరవ పట్ల జానకి బంధువులు 108 సిబ్బంది శ్రీరామ్, తిరుపతికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు...