ప్రభుత్వ పురుషుల కళాశాలలో ఘనంగా మహాకవి కాళిదాసు జయంతి వేడుకలు
కడప ప్రజావాణి20 నవంబర్ కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో సంస్కృత శాఖ ఆధ్వర్యంలో మహాకవి కాళిదాసు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ప్రముఖ అతిథులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని మహాకవి కాళిదాసు సాహిత్య ప్రతిభను,సంస్కృత భాషకు ఆయన అందించిన అపారమైన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె.వెంకటలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరుకాగా, బ్రౌన్ గ్రంథాలయ పరిశీలకులు శ్రీ చింతకుంట శివారెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మహాకవి కాళిదాసు జీవిత విశేషాలు, ఆయన రచనల గొప్పతనం,భారతీయ సాహిత్యంపై...