గ్రామపంచాయతీ ఎన్నికలు ఎలక్షనా’లేక సెలక్షనా’? పోలీసుల సామ్రాజ్యంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది: మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్ర ఆగ్రహం
బద్వేల్,నవంబర్ 20:ప్రజావాణి ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్నాయా.లేక అధికార పక్షం కనుసన్నల్లో 'సెలక్షన్ల' పర్వంగా మారుతున్నాయా?అనే అనుమానం కలుగుతోందని మాజీ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియ సాగుతున్న తీరుపై ఆయన ఘాటుగా విమర్శలు గుప్పించారు.స్థానిక పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత జిల్లా ఎస్పీ (రాష్ట్ర పోలీస్ యంత్రాంగం) ఎక్కడా...