prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 9:07 am Digital Edition : PRAJA VANI

12వ జెబిసిసిఐ కమిటీ ఏర్పాటు జాప్యంపై ఏఐసిడబ్ల్యూఎఫ్ అసంతృప్తి

*12వ జెబిసిసిఐ కమిటీ ఏర్పాటు జాప్యంపై ఏఐసిడబ్ల్యూఎఫ్ అసంతృప్తి*

*కోలిండియా చైర్మన్ కు లేఖ*

* *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*

దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల 12వ వేతన సవరణ కమిటీ (జేబిసిసిఐ-12) ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై సిఐటియు అనుబంధ సంస్థ అయిన ఆల్ ఇండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐసిడబ్ల్యూఎఫ్) కోల్ ఇండియా యాజమాన్యానికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిందని ఏఐసిడబ్ల్యూఎఫ్ జాతీయ కార్యదర్శి అల్లి రాజేందర్ గురువారం ప్రకటనలో తెలిపారు. లక్షలాది మంది బొగ్గు గని కార్మికుల వేతనాలు, భత్యాలపై నిర్ణయాలు తీసుకునే అత్యున్నత ద్వైపాక్షిక కమిటీ ఏర్పాటును కోలిండియా యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం ఆందోళనకరమని పేర్కొంటూ గురువారం సంఘం అదనపు ప్రధాన కార్యదర్శి విఎం మనోహర్ కోల్ ఇండియా సీఎండీ కి లేఖ రాశారని తెలిపారు. దేశ ఇంధన అవసరాల కోసం కార్మికులు అంకితభావంతో శ్రమిస్తున్నారని గుర్తుచేస్తూ, కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే 12వ జేబిసిసిఐ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని లేఖలో ఏఐసిడబ్ల్యూఎఫ్ డిమాండ్ చేసిందని తెలిపారు.