prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 9:40 am Digital Edition : UPENDHAR JANAGON

సిద్దిపేట సభకు భారీగా తరలిన జనగామ కాంగ్రెస్ శ్రేణులు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 20 (ప్రజావాణి): సిద్దిపేటలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు జనగామ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో జనగామ నుండి బస్సుల్లో బయలుదేరిన కార్యకర్తలకు ముఖ్య నాయకులు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సిద్దిపేట సభను విజయవంతం చేయడానికి జనగామ నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లడం కాంగ్రెస్ పార్టీ బలానికి నిదర్శనమని అన్నారు. పార్టీ కార్యకర్తల ఉత్సాహం, ఐక్యత చూస్తుంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొత్త కరుణాకర్ రెడ్డి, జనగామ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోర్నాల వెంకటేశ్వర్లు, జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుండా శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్ చెంచారపు కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మెడ శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు వంగాల మల్లారెడ్డి, చెంచారపు బుచ్చి రెడ్డి, బనుక సిద్ధిరాజ్ యాదవ్, గానిపాక మహేందర్, ప్రభాకర్ యాదవ్, రాజు, సంతోష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకాశ్, పృథ్వి రాజ్, రఘు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, సీనియర్ నేతలు, వార్డు కాంగ్రెస్ అధ్యక్షులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నేతలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.