prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 3:37 pm Digital Edition : PRAJA VANI

శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

​శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 20

​(నల్గొండ జిల్లా):
, త్రిపురారం మండలం, కుంకుడు చెట్టు గ్రామపంచాయతీ పరిధిలోని పానుగోతు తండాలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ ప్రతిష్ట మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి సభ్యులు (MLC) కేతావత్ శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
​ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు ఎమ్మెల్సీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తండావాసులు, పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో తండాలో పండుగ వాతావరణం నెలకొంది.
​ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ వెంట కొండ లక్ష్మణ్ గౌడ్, రామావత్ బాలు నాయక్, సర్పంచ్ కిషన్ నాయక్, మాజీ ఎంపీటీసీ అనిల్, పానుగోతు స్వామి, వాగ్య తదితర ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
​
​