వెలుగుతున్న విద్యుత్ దీపాలు.. పట్టించుకోని పంచాయతీ అధికారులు

వెలుగుతున్న విద్యుత్ దీపాలు.. పట్టించుకోని పంచాయతీ అధికారులు! నవంబర్ 20 ప్రజావాణి న్యూస్/సంగెం గ్రామంలో పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ వృథా – నిద్రావస్థలో గ్రామ పంచాయతీ పాలకవర్గం! సంగెం మండలం గవిచర్ల గ్రామంలో విద్యుత్ దీపాలు అవసరం లేకున్నా ఆరిపోకుండా నిరంతరం వెలుగుతుండటంతో విద్యుత్ వృథా అవుతోంది. గ్రామంలో పలు వీధుల్లో విద్యుత్ దీపాలు పగలు కూడా వెలుగుతుండడం పంచాయతీ నిర్వహణ తీరుపై ప్రశ్నలు తలెత్తిస్తోంది. ప్రజాధనం, విద్యుత్ ఆదా చేయాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీపై ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు, సిబ్బంది...