prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 4:04 pm Digital Edition : PRAJA VANI

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్

వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన జుక్కల్ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 20

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం జూక్కల్ గ్రామ లక్ష్మీనారాయణ గౌడ్ గారి కుమార్తె వివాహ మహోత్సవానికి జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్ మరియూ జుక్కల్ ఉపసర్పంచ్ షేక్ ఫిర్దోస్ జూక్కల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.
జుక్కల్ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించిన ఈ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందాలతో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వధూవరుల కుటుంబ సభ్యులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
నూతన వధూవరులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు. వారి దాంపత్య జీవితం కలకాలం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాం.